దర్శకులకు భారీ క్రేజ్ ఉన్న హీరో లతో లేదంటే భారీ అభిమానులు కలిగిన హీరోలతో సినిమా చేయాలనే కోరిక ఎంతగానో ఉంటుంది. దానివల్ల వారు కూడా పెద్ద దర్శకులు గా ఎదగవచ్చు అనేది వారి ఆలోచన. ఆ విధంగా ఇప్పుడు ప్రేక్షకులలో మంచి క్రేజ్ కలిగి ఉన్న హీరో విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలని ప్రతి ఒక అగ్ర దర్శకుడు కూడా ఆలోచన చేస్తూ ఉండడం విజయ్ దేవరకొండ యొక్క స్టార్డంను తెలియజేస్తుంది.

ఇప్పటికే అందరూ దర్శకులతో ని ఆయన తన తదుపరి సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేసిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. సినిమా పనులలో నిమగ్నమై ఉన్న సుకుమార్ ఆ చిత్రం చిత్రీకరణ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాలి. 

ఈ సినిమాల తర్వాత కూడా అగ్ర దర్శకులు తో సినిమాలు చేయడానికి విజయ్ దేవరకొండ ప్లాన్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ కొరటాల శివ హరీష్ శంకర్ వంటి దర్శకులతో ఆయన సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే హరీష్ శంకర్ ఆయనతో సినిమా కోసం దిల్ రాజు తో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అంతే కాదు త్వరలోనే ఈ సినిమా యొక్క పూర్తి విషయాలు వెల్లడించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఆ దర్శకులు కూడా ఈ హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ హీ రో బాడీలాంగ్వేజ్ కు ఆయన స్టార్టమ్ కు తగ్గ కథలను రాసి వినిపించడానికి సిద్ధమవుతున్నారట. మరి అన్నీ కుదిరితే త్వరలోనే ఈ దర్శకులతో విజయ్ దేవరకొండ చేయబోయే సిని మా యొక్క అధికారిక ప్రకటన వెలువడుతుంది అంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: