తెలుగునాట మంచి క్రేజ్ ను కలిగి ఉన్న హీరోయిన్ సమంత. చిత్రాల ద్వారా మాత్రమే కాకుండా వివాదాల ద్వారా కూడా మంచి ఫాలోయింగ్ అందుకుంటూ వుంటుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఇంకొక వైపు విమర్శలు ఎదుర్కుంటూ నిత్యం ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.   నాగచైతన్యతో విడాకుల తర్వాత వరుస సినిమాలలో నటించే విధంగా రంగం సిద్ధం చేసుకుంటుంది. తెలుగులో మాత్రమే కాదు ఇతర భాషలలో సైతం ఈమె సినిమాలలో నటించడానికి సిద్ధమవుతోంది.

ఇప్పటికే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆమెకు పలు అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో టాలీవుడ్లో పెద్ద హీరోల సరసన నటించడానికి సిద్ధం అవుతుంది సమంత. విజయ్ దేవరకొండ సరసన శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. హైదరాబాద్లో ఈ సినిమా షెడ్యూల్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈమె విడాకుల తరువాత ఎక్కువగా గ్లామరస్ గా కనిపించడం ఆమె అభిమానులకు కిక్ ఇస్తున్నా కూడా ఆమె ఈ విధంగా కనిపించడం పట్ల కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

టాలీవుడ్ లాంటి గ్లామరస్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే ఆమాత్రం గ్లామర్ చూపించవలసిందే అని కొంతమంది చెబుతున్నారు.  సమంత ఇటీవలే కొన్ని ఫొటో షూట్ లతో తన పరువాలను వెదజల్లుతూ ఆమె అభిమానులను అలరిస్తోంది. వాస్తవానికి పెళ్లయిన తర్వాత చాలా మంది హీరోయిన్లు సినిమాల్లో నటిండానికి పెద్దగా ఆసక్తి చూపించరు. ఎప్పుడో మళ్లీ మధ్యలో వారు దర్శనమిస్తారు. అలాంటిది సమంత పెళ్లి అయిన తర్వాత కూడా కొన్ని సినిమాలలో నటించడానికి  సిద్ధం అయింది. ఇప్పుడు విడాకుల తర్వాత కెరీర్ ప్రధానం గా ముందుకు సాగుతుంది.  ఆమె వరస చుస్తుంటే మరికొన్ని రోజులు ఆమె సినిమాల్లో కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఆవిధంగా ఆమె ఏ స్థాయి లో సినిమాలలో నటిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: