నాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన అంటే సుందరానికి మూవీ జూన్ 10 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో నాని సరసన నజ్రియా కథానాయికగా నటించింది. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన వివేకా ఆత్రేయ దర్శకత్వం వహించాడు.  

మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న అంటే సుందరానికి మూవీ థియేటర్ లలో విడుదలైన మొదటి షో కే పర్వాలేదు అని రేంజ్ టాక్ ను తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేస్తోంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. వివేక్ సాగర్ ఈ మూవీ కి సమకూర్చిన సంగీతానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా అంటే సుందరానికి మూవీ చిత్ర బృందం ఒక అప్ డేట్ ను విడుదల చేసింది. ఈ సినిమా నుండి పంచెకట్టు  వీడియో సాంగ్ ను ఈ రోజు ఉదయం 11 గం. 07 ని. లకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మొదట ఆడియో సాంగ్ తో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకొని,  థియేటర్ లలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సాంగ్ , మరి ఫుల్ వీడియో సాంగ్  ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

పంచెకట్టు సాంగ్ ను ప్రముఖ గాయకురాలు అరుణా శ్రీరామ్ పాడారు. ఇలా అంటే సుందరానికి చిత్ర బృందం ఈ సినిమా నుండి  ఫుల్ వీడియో సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఫై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ కలిసి నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: