ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో కృతి శెట్టి ఒకరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్న అన్ని సినిమాలు మరి ఏ హీరోయిన్ చేతిలో కూడా దాదాపుగా లేవు. ఉప్పెన మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది. 

కృతి శెట్టి ప్రస్తుతం సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి , నితిన్ సరసన నియోజకవర్గం, రామ్ పోతినేని సరసన ది వారియర్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మూడు విషయాలను అందుకొని, మరో మూడు సినిమాల్లో నటిస్తున్న కృతి శెట్టి వీటితో పాటు నాగ చైతన్య , వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కబోయే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇలా వరుస మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న కృతి శెట్టి సోషల్ మీడియా కూడా అంతే యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా కృతి శెట్టి తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో కృతి శెట్టి డిఫరెంట్ లుక్ లో ఉన్న అనేక రంగులు కలిగిన డ్రెస్ ను వేసుకుంది. ఈ డ్రెస్ లో కృతి శెట్టి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కృతి శెట్టి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: