టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయిన అల్లు అర్జున్ వరుస విజయా లతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే . త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలా వైకుంఠపురంలో మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప తో  మరో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు .

ఇలా రెండు వరుస బ్లాక్ బస్టర్ విజయా లతో ఫుల్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ , ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా ప్రముఖ సంస్థ గూగుల్ వారు టాప్ 100 సెర్చ్ ఏషియాన్స్ లిస్ట్ ని నేడు కొద్ది సేపటి క్రితం విడుదల చేయగా ఇందులో సౌత్ ఇండియా నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు . ఇక టాలీవుడ్ నుండి ఇతర హీరోల విషయానికి వస్తే ... జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ ,  ప్రభాస్ లు కూడా ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్నారు .

ఈ లిస్ట్ లో కోలీవుడ్ నుండి తళపతి విజయ్ కూడా నిలిచాడు. ఇది ఇలా ఉంటే ఈ లిస్ట్ లో సౌత్ నుండి హీరోయిన్ లలో కాజల్ అగర్వాల్ మొదటి స్థానంలో నిలవగా ,  ఆ తర్వాత సమంత , నయనతార , తమన్నా , పూజా హెగ్డే లు ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్నారు. ఈ సంవత్సరం ప్రముఖ సంస్థ గూగుల్ వారు టాప్ 100 సెర్చ్ ఏషియాన్స్ లిస్ట్ లో సౌత్ నుండి హీరో లలో అల్లు అర్జున్ ప్రథమ స్థానంలో నిలవగా, హీరోయిన్ లలో కాజల్ అగర్వాల్ ప్రథమ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: