టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో లలో ఒకరు ఆయన రామ్ పోతినేని ప్రస్తుతం లింగు స్వామి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ది వారియర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా , ఆది పినిశెట్టి ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు .

మూవీ ని జూలై 14 వ తేదీన విడుదల చేయబోతున్నారు . ఈ సినిమా తర్వాత రామ్ పోతినేని , బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు . ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని , బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత నటించబోయే మూవీ ని కూడా ఇప్పటికే లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది .  అందులో భాగంగా రామ్ పోతినేని, బోయపాటి శీను దర్శకత్వం లో తెరకెక్కబో యే సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కబోయే  సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది . హరీష్ శంకర్ మరి కొన్ని రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా భవదీయుడు భగత్ సింగ్ సినిమాను తెరకెక్కించ బోతున్నారు .  ఈ సినిమా పూర్తి అయిన తర్వాత రామ్ పోతినేని తో మూవీ ని తెరకెక్కించబోతున్నాట్లు తెలుస్తోంది .

ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది . హరీష్ శంకర్ ,  రామ్ పోతినేని తో పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీ ని తెరకెక్కించ బోతున్నాట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది . ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: