అందాల ముద్దు గుమ్మ లావణ్య త్రిపాటి తాజాగా హ్యాపీ బర్త్ డే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి మత్తు వదలరా లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కి దర్శకత్వం వహించిన రితేష్ రానా దర్శకత్వం వహించాడు . ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లు చాలా డిఫరెంట్ గా ఉండడంతో సినీ ప్రేక్షకులు ఈ సినిమాపై మంచి అంచనాలే పెట్టుకున్నారు . 

అలా సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ని మొదట జూలై 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది . ఆ తర్వాత ఈ మూవీ ని చెప్పిన తేదీ కంటే ముందు గానే అనగా జూలై 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం హ్యాపీ బర్త్ డే సినిమాను తక్కువ ధరలతో తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం హ్యాపీ బర్త్ డే సినిమా టికెట్ ధరలు తెలంగాణ రాష్ట్రంలో మల్టీప్లెక్స్ థియేటర్ లలో 150 రూపాయలుగా , సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో 100 రూపాయలుగా పెట్టనున్నట్లు తెలుస్తోంది .

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని నవీన్ యెర్నేని , రవిశంకర్ వై సమర్పణలో క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దమల్లు నిర్మించారు. మరి ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న హ్యాపీ బర్త్ డే మూవీ ఎలాంటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: