తలపతి విజయ్ కి కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించి ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ తమిళ్ తో పాటు, తెలుగు లోనూ మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

ఇప్పటికే తలపతి విజయ్  నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే తలపతి విజయ్ 'బీస్ట్' మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాకపోతే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తలపతి విజయ్ వరిసు (వారసుడు) అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా,  దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో తళపతి విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం తలపతి విజయ్ కి సంబంధించిన కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా, ఒక్కో పోస్టర్ లో ఒక్కో రకంగా కనిపించి తలపతి విజయ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే... విజయ్ 20 సంవత్సరాల క్రితం చేసిన మూవీ లోని 'ఆల్ తొట్ట భూపతి' అనే సాంగ్ ని వరిసు (వారసుడు) మూవీ లో రీమేక్ చేసేందుకు తమన్ ప్లాన్ చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: