అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన అంద చందాలతో, నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. 

ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలను దక్కించుకుంది. ఇలా అనేక తెలుగు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏర్పరుచుకున్న లావణ్య త్రిపాఠి గత కొద్ది కాలంగా నటించిన సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ విజయాలను సాధించలేదు. దానితో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తాను నటించిన హ్యాపీ బర్త్ డే సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది. తాజాగా లావణ్య త్రిపాటి నటించిన హ్యాపీ బర్త్ డే సినిమాకు మత్తు వదలరా ఫెమ్ రితీశ్ రానా దర్శకత్వం వహించాడు  ఇది ఇలా ఉంటే ఈ సినిమాను మొదట జూలై 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆ తర్వాత ఈ సినిమాను జూలై 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితమే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా హ్యాపీ బర్త్ డే చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీ ని మరియు సమయాన్ని అధికారికంగా ప్రకటించింది. హ్యాపీ బర్త్ డే ట్రైలర్ ను జూన్ 29 వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: