రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ బడ్జెట్ సినిమాలకు టిక్కెట్ ధరలను ఈ సినిమా విడుదల అయిన కొన్ని రోజుల పాటు పెంచుకునే వెసులుబాటును కల్పించిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే స్టార్ హీరోలు నటించిన కొన్ని సినిమాలకు మరియు స్టార్ దర్శకులు దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు అత్యధిక బడ్జెట్ కావడం వల్ల ఆ సినిమా టికెట్ రేట్లు ఎక్కువగా పెట్టడం కూడా జరిగింది.

అందులో భాగంగా సినిమాలకు అత్యధిక కలెక్షన్లు రావడం కూడా జరిగింది. ఇది ఇలా ఉంటే సినిమా టికెట్ రేట్లను ఎక్కువగా పెట్టడం ద్వారా కొంత మంది సినీ ప్రముఖులు కూడా సినిమాలు చూడడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అలాగే టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ ల లోకి కూడా సినిమాలు అతి తక్కువ రోజుల్లోనే వస్తుండడంతో సినిమాలను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దానితో కొన్ని సినిమాలకు టికెట్ ధరలు అధికంగా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం పెద్దగా రావడం లేదు. దానితో మేకర్స్ కూడా సినిమాను తక్కువ టికెట్ ధర లతోనే విడుదల చేయడానికి ప్రస్తుతం ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదలకు ముందు టిక్కెట్ ధరలను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతున్నాయో అఫీషియల్ గా తెలియజేసిన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే పక్కా కమర్షియల్ సినిమాను కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో పర్వాలేదు అనే రేంజ్ టికెట్ ధరలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం పక్కా కమర్షియల్ సినిమా టికెట్ ధరలు తెలంగాణ రాష్ట్రంలో మల్టీప్లెక్స్ థియేటర్ లలో 200 , 250 , 290 రూపాయల వరకు , సింగల్ స్క్రీన్ థియేటర్లలో 110 , 150 రూపాయలు గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్కా కమర్షియల్ మూవీ టికెట్ ధరలు మల్టీప్లెక్స్ థియేటర్లలో 177 గాను , సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 112 , 147 రూపాయలు వరకు ఉండను ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే పక్కా కమర్షియల్ సినిమాలో గోపిచంద్ హీరోగా నటించగా రాశి కన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: