మాస్ మహారాజా రవితేజ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ని మొదలు పెట్టి , ఆ తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకొని హీరోగా ఎన్నో మూవీ లలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న రవితేజ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు . 

అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న రవితేజ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాంటి మూవీ లలో రవితేజ కెరీర్ లో 'బలుపు' సినిమా ఒకటి. బలుపు మూవీ తో రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ఫుల్ మాస్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ లో రవితేజ సరసన శృతి హాసన్ , అంజలి హీరోయిన్ లుగా నటించగా,  గోపీచంద్ మలినేని ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందించాడు. బలుపు సినిమా విజయంలో తమన్ అందించిన సంగీతం కూడా కీలక పాత్ర ను పోషించింది.

మూవీ ని పీవీపీ సినిమా బ్యానర్ పై ప్రసాద్ వర పొట్లూరి  నిర్మించారు. ఈ సినిమా 28 జూన్ 2013 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమా ఈ రోజుతో తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 'బలుపు' చిత్ర బృందం తాజాగా ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: