ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా "ఆర్ ఆర్ ఆర్" గురించి జనం మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ అదరకొట్టిన "ఆర్ ఆర్ ఆర్".అయితే రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చ్ 25 న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ గా నిలిచింది. పోతే బాహుబలి 2 రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ ఈ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఇక  కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

అయితే థియేట్రికల్ రిలీజ్ అయ్యి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా దేశ విదేశాలను చుట్టేస్తూ వస్తోంది. కాగా ఇండియాలో ఆర్ ఆర్ ఆర్ సినిమా ను జీ 5 లో స్ట్రీమింగ్ చేస్తూ ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ను నెట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది.ఇక  ఇప్పటికే పదుల దేశాల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా ను ఆయా దేశాల భాషల్లో సబ్ టైటిల్స్ వేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు.అయితే  ప్యాన్ ఇండియన్ సినిమాగా విడుదలైన ఈ చిత్ర తెలుగు, తమిళ్, మలయాళం, మరియు కన్నడ వెర్షన్లు జి 5 లో స్ట్రీమ్ అవుతుండగా హిందీ వెర్షన్ మాత్రం డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది.పోతే  బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీ లో కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది.

ఇకపోతే అదే క్రమంలో ఇప్పుడు సౌత్ కొరియాలో కూడా ఆర్ ఆర్ ఆర్ ను నెట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక అక్కడ ప్రేక్షకుల కోసం కొరియన్ సబ్ టైటిల్స్ వేసి మరీ సినిమా చూపిననట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.పోతే  ఈ సినిమా కనుక కొరియా ప్రేక్షకులకు నచ్చితే... వరస పెట్టి మన సినిమాలు కొరియా సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేద్దామనే నిర్ణయానికి కొందరు నిర్మాతలు వచ్చారట. అయితే వారు ఈ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.ఇదిలావుంటే తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా "ఆర్ఆర్ఆర్" సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఈ సినిమాని ఆస్కార్ బరిలో నిలిపే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు చెబుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR