తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఈశ్వర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా ఓ రకంగా మంచి ఫలితాలను ఇవ్వడంతో తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ వస్తున్నాడు. ఎన్నో సినిమాలను చేస్తూ వస్తున్నాడు.. అవన్నీ కూడా మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు డార్లింగ్.. దేశవ్యాప్తంగా అత్యథికంగా అభిమానులను సంపాదించుకున్నారు ప్రభాస్.ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారారు..


బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులకు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న ప్రభాస్‏కు జూన్ 28 చాలా ప్రత్యేకం..ఈరోజు మొదటిసారి కెమరా ముందుకు వచ్చిన రోజు..నేటితో 20 ఏళ్ళు పూర్తయింది. 2002 జూన్ 28 న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా పరిచయం అవుతూ ఈశ్వర్ అనే సినిమాని మొదలుపెట్టారు.20 ఏళ్ళు పూర్తీ అయిన సందర్భంగా ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.


ఈ సందర్బంగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు మాట్లాడుతూ .. “ప్రభాస్ హీరోగా పరిచయం అయి అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయా అన్న సందేహం కలుగుతుంది . నిజంగా ఆ రోజు ప్రభాస్ ని హీరోగా పరిచయం చేద్దామని ముందు మేమె అనుకున్నాం. మా గోపి కృష్ణ బ్యానర్ లో ప్రభాస్ ని పరిచయం చేయాలనీ అనుకున్న తరువాత ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగారు. ఈశ్వర్ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథ, తప్పకుండా అందరికి బాగా నచ్చుతుందన్న నమ్మకంతో అశోక్ కుమార్ కు ఓకే చెప్పాము.


జయంత్, అశోక్ ఇద్దరు కలిసి ఎంతో బాధ్యతగా తీసిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుని ప్రభాస్ ని హీరోగా నిలబెట్టింది. పైగా ఆ సినిమాలో అశోక్ కుమార్ చెడ్డ తండ్రి పాత్రలో నటించడం గొప్ప విషయం..ప్రభాస్ ని చుస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక నటుడిగానే కాకుండా సాటివారి పట్ల సహాయం చేసే గొప్ప గుణం ఉంది. ప్రభాస్ ఇంకా ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలని మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: