టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన రామ్ పోతినేని ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. 

ఇప్పటికే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటల్లో నుంచి కొన్ని పాటలను చిత్ర బృందం  విడుదల చేయగా ఆ పాటలకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ది వారియర్ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో జూలై 14 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ మూవీ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను, పాటలను చిత్ర బృందం విడుదల చేసింది వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసింది.

తాజాగా ది వారియర్ చిత్ర బృందం జూలై 1 వ తేదీన సాయంత్రం 7 గంటల 57 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించి ఒక పోస్టర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల అయిన టీజర్ లో రామ్ పోతినేని పవర్ ఫుల్ డైలాగ్ లతో, మాస్ మేనరిజంతో అదరగొట్టాడు. మరి ఈ ట్రైలర్ తో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుండో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: