తెలుగు, హింది స్టార్ లు ఒకే చోట చేరితే ఫ్యాన్స్ కు కన్నుల పండుగనే చెప్పాలి..స్టార్ హీరోలు అంత కలిసి పార్టీ చేసుకుంటూ సందడి చేస్తే ఆ హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ప్రస్తుతం హైదరాబాద్ స్టార్స్ సందడి మొదలైంది.ఒకే చోటుకి బాలివుడ్, టాలివుడ్ స్టార్స్ తో ఆ వాతావరణం మొత్తం సందడిగా మారింది.విషయాన్నికొస్తే..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ నాగ్ అశ్వీన్ కాంబోలో ప్రాజెక్ట్ కే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.


అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ దీపికా పడుకొనే, అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు..గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బీ, దీపికా భాగ్యనగరంలో సందడి చేస్తున్నారు.. తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ పూర్తైంది. ఈ క్రమంలోనే ఇటీవల చిత్రయూనిట్ సభ్యులకు ప్రభాస్ గ్రాండ్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.


ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ కే చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చిన అమితాబ్ బచ్చన్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కు డైరెక్టర్ నాగ్ అశ్వీన్ స్పెషల్ ట్రీట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. ఈ పార్టీకి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దుల్కర్ సల్మాన్, నాని వంటి సినీ ప్రముఖులు పాల్గోన్నట్లుగా తెలుస్తోంది.. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‏తో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ. ' ఇది జరిగిపోయింది.. బడే మీయాన్.. చోటే మీయాన్ ' అంటూ స్మైలీ ఎమోజీ షేర్ చేశారు.అమితాబ్ సైతం ప్రాజెక్ కే సెట్ లో స్టార్స్ అందరిని కలవడం పై సంతోషం వ్యక్తం చేశారు.. రాఘవేంద్రరావు లెజెండ్.. ప్రభాస్ బాహుబలి, నాని ఓ స్టార్.. దుల్కర్ సల్మాన్ ఓ స్టార్ అంటూ అందరి గురించి చెబుతూ పోస్ట్ చేశాడు..మొత్తానికి ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: