బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా గుర్తింపు తెచ్చుకుని.. యాంకర్ గా మొదటి స్థానంలో బుల్లితెరను ఏలుతోంది యాంకర్ సుమ. ఇక కేవలం పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించడమే కాకుండా వెండితెరపై ఏ ఈవెంట్ అయినా.. ఏ సినిమా ఫంక్షన్ లో చూసినా సుమ కనకాల పేరే వినిపిస్తూ ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తన మాటలతో ఎంటర్టైన్ చేస్తూ వారిని అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఒకవైపు ఈవెంట్లు చేస్తూ.. మరొకవైపు బుల్లితెరపై పలు షోలకు, షూటింగ్లకు అటెండ్ అవుతూ బిజీబిజీగా ఉంటూనే తనకు సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

అంతేకాదు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా.. పలు వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ముఖ్యంగా సుమా ఒక ఈవెంట్ కి హోస్ట్ గా చేస్తోంది అంటే చిరంజీవి లాంటి వారు కూడా భయపడతారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.. అంతేకాదు ఈమె ఏదైనా ఈవెంట్ కి  హోస్ట్గా చేసింది అంటే కచ్చితంగా ఈవెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక సుమా వచ్చిందంటే చాలు దర్శక నిర్మాతలతో పాటు ఈవెంట్ మేనేజర్లు కూడా ఫుల్ రిలాక్స్ అయి పోవచ్చు అని చెప్పవచ్చు. ఇక అగ్ర దర్శకుల నుంచి నిర్మాతలు , హీరోలు ఇలా ప్రతి ఒక్కరు కూడా సుమ యాంకరింగ్ ను ఎక్కువగా ఇష్టపడతారు.

ఇక ఇంత డిమాండ్ ఉంది కాబట్టే ఆమె కూడా పారితోషికం విషయంలో అంత డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది.  ఇక సుమా ఒక ఈవెంట్ కి హో స్టింగ్ చేస్తే ఈవెంట్ మేనేజర్లు ఆమెకు రూ.3 నుండి రూ.4 లక్షల రూపాయలు పారితోషికంగా ఇస్తారట. అంతేకాదు చిన్న పెద్ద అనే సినిమా తేడా లేకుండా ఏ సినిమాకైనా సరే ఆమె మొదట తన రెమ్యూనరేషన్ ను  ఫిక్స్ చేసుకున్న తర్వాతనే ఆ ఈవెంట్ కి హోస్టుగా వ్యవహరిస్తుందట. ఇక ఆమెకు ఉన్న డిమాండ్ కారణంగా ఈవెంట్ మేనేజర్లు కూడా ఆమెకు ఎంత పారితోషికం ఇవ్వడానికైనా వెనకాడడం లేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: