టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ తాజాగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో గోపీచంద్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో నటించగా , రావు రమేష్ ,  సత్య రాజ్ , అనసూయ , అజయ్ ఘోష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించగా, ఈ మూవీ కి జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించాడు.

ఇప్పటికే ఈ సినిమాకు జేక్స్ బెజోయ్ అందించిన కొన్ని పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు మారుతి పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ లో కామెడీ ని జోడిస్తూ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే జులై 1 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే పక్కా కమర్షియల్ చిత్ర బృందం అనేక టీవీ షో లలో పాల్గొంటూ మరియు టీవీ ఇంటర్వ్యూ లలో , సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేయగా ఈ సినిమా ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని అందాల రాశి అనే వీడియో సాంగ్ లో చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఆడియో సాంగ్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ తెచ్చుకుంది. సాయి చరణ్, రమ్య బెహరా ఈ సాంగ్ ను పాడారు. ఇప్పటికే అందాల రాశి ఆడియో సాంగ్  ఫుల్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది.  మరి వీడియో సాంగ్  ఏ రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: