ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యధిక రెమ్యునరేషన్ ను తీసుకుంటూ, స్టార్ హీరోల సరసన వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ ఫుల్ స్పీడ్ లో ముందుకు దూసుకుపోతున్న హీరోయిన్ లలో పూజా హెగ్డే ఒకరు. ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

ఆ తర్వాత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మకు అక్కడ ఆశించిన విజయాలు దక్కలేదు. దాంతో తిరిగి టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు మంచి విజయాలను సాధించడం, దానితో పూజా హెగ్డే కు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కింది. అందులో భాగంగా దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరు స్టార్ హీరోల సరసన నటించిన పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పూజా హెగ్డే తమిళ ఇండస్ట్రీలో కూడా  స్టార్ హీరోయిన్ లలో  ఒకరిగా కొనసాగుతోంది. ప్రస్తుతం పూజా హెగ్డే హిందీ లో కూడా పలు ప్రాజెక్ట్ లలో నటిస్తోంది. ఇలా తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో క్రేజీ సినిమాలలో నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ తో ముందుకు తీసుకు వెళ్తున్న పూజా హెగ్డే తన సినిమాలలో అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. 

ఇలా సినిమాల్లో అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ కుర్రకారును వేడెక్కిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా పూజా హెగ్డే తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో మెరూన్ కలర్ లో ఉన్న పొడవాటి డ్రెస్ ను వేసుకున్న పూజా హెగ్డే తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం పూజా హెగ్డే కు సంబంధించిన  ఈ హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: