హైపర్ ఆది.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే బుల్లితెర ప్రేక్షకుల తో పాటు వెండితెర ప్రేక్షకులకు కూడా హైపర్ ఆది ప్రస్తుతం సుపరిచితుడు గా  మారిపోయాడు. ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉండే హైపర్ ఆది తనలో ఉన్న రైటింగ్ టాలెంట్ కారణంగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక జబర్దస్త్ లో  తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతే కాదుసాదా సీదా కంటెస్టెంట్ స్థాయి నుంచి ఏకంగా టీం లీడర్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే హైపర్ ఆది అటు జబర్దస్త్ లో కామెడీ పంచులు లో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. తన పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కేవలం జబర్దస్త్ తోనే తన టాలెంట్ ను ఆపేయకుండా ఇక ఈ టీవీలో ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాలకు స్క్రిప్ట్ అందించడం లాంటివి కూడా చేశాడు. పలు సినిమాలకు రచయితగా పనిచేశాడు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తన సత్తా చాటాడు హైపర్ ఆది. ఇక జబర్దస్త్ లో టాప్ టీమ్ లీడర్గా కొనసాగుతున్నప్పటికీ ఇటీవలే జబర్దస్త్ కు కాస్త దూరంగానే ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో మాత్రం సందడి చేస్తూ ఉన్నాడు.



 ఇక పోతే వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించిన ఢీ షో ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో లో భాగంగా అక్కినేని సుశాంత్ స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ ప్రోమోలో ఎప్పటిలాగానే హైపర్ ఆది తనదైన శైలిలో కామెడీ పంచ్ లతో ఎంటర్టైన్మెంట్ పంచాడు. ఈ క్రమంలోనే తన పక్కనే ఉన్న తేజు తన భార్య అని అందరికీ పరిచయం చేస్తాడు. మరో పక్కన ఉన్న ముగ్గురు పిల్లలను కూడా తన  కన్న బిడ్డలు  అంటూ పరిచయం చేస్తాడు. దీంతో అభిమానులు అందరూ షాక్ అవుతారు. ఇక ఆ తర్వాత నాన్నను మార్చేయాలి అని ఒక కంటెస్టెంట్ అనగా.. సరే అలాగే మార్చేద్దాం అంటూ హైపర్ ఆది  భార్య పాత్రలో నటించిన తేజు అంటుంది. దీంతో హైపర్ ఆది షాక్ అవుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: