ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నేషనల్ క్రష్ రష్మీక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన పుష్ప సినిమా ఎ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో మన అందరికి తెలిసిందే . ఈ మూవీ లో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రతి నాయకుడి పాత్రలో నటించగా , రావు రమేష్ , సునీల్ , అనసూయ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు .

మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు . పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన పుష్ప సినిమా విడుదల అయిన మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా, కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న పుష్ప సినిమా ఇప్పటికి మూడు సార్లు బుల్లి తెరపై ప్రసారం అయ్యింది.

మొదటి సారి పుష్ప సినిమా బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 22.54 'టి ఆర్ పి' ని సాధించింది. రెండవ సారి పుష్ప సినిమా బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 12.87 'టి ఆర్ పి' ని సాధించాలి. పుష్ప సినిమా తాజాగా మూడో సారి బుల్లి తెరపై ప్రసారం అయ్యింది. మూడో సారి కూడా పుష్ప సినిమా బుల్లి తెరపై అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకుంది. మూడో సారి పుష్ప సినిమా బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 9.59 'టి ఆర్ పి' ని సొంతం చేసుకుంది. ఇలా పుష్ప సినిమా మూడో సారి కూడా బుల్లితెర పై అదిరిపోయే 'టి ఆర్ పి' ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: