బెల్లంకొండ
శ్రీనివాస్ హీరోగా
ప్రభాస్ చిత్రం
ఛత్రపతి ను
బాలీవుడ్ లో
రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల క్రితం ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను దర్శకుడు రాజమౌళి భారీ స్థాయిలో తెరకెక్కించగా ఈ చిత్రాన్ని
బాలీవుడ్ లో
రీమేక్ చేయడానికి సిద్ధం అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. భారీ రికార్డులను సాధించి
ప్రభాస్ ను
మాస్ హీరోగా నిలబెట్టిన ఈ చిత్రం ద్వారా
బాలీవుడ్ లో లాంచ్ అయితే తనకు కూడా మంచి గుర్తింపు వస్తుందని బెల్లంకొండ
శ్రీనివాస్ భావించాడు.
అందుకే ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాను హిందీలో
రీమేక్ చేయడానికి సాహసం చేశాడు. ప్రేక్షకులు కూడా ఈ
సినిమా హిట్ అవ్వాలని భావిస్తున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులలో బెల్లంకొండ
శ్రీనివాస్ కు మంచి గుర్తింపు ఉంది. ఆయన హీరోగా నటించిన చాలా సినిమాలను అక్కడి ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఈ నేపథ్యంలో అక్కడ తనకున్న మార్కెట్ను చూసి ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేస్తున్నాడు. మేకోవర్ పరంగా బెల్లంకొండ
శ్రీనివాస్ ప్రభాస్ స్థాయిలో కనిపించడానికి చాలానే జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ విధంగా ఈ
సినిమా ఎన్నో కష్టాల మధ్య తెరకెక్కిన కూడా ఇప్పుడు ఈ
సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడం అసలు ఈ
రీమేక్ కు ఏమయిందో అన్న అనుమానాలను కలిగిస్తుంది.
ప్రస్తుతానికి అందరూ ఖాళీగా ఉండటంతో ఈ
రీమేక్ సినిమా ఉన్నట్ల లేనట్లా అనే కామెంట్లు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇక ఇన్ని కారణాల మధ్య ఈ సినిమాను బెల్లంకొండ
శ్రీనివాస్ ఎప్పుడు చేస్తాడో చూడాలి. తాజాగా ఈ సినిమాకు మరో సమస్య ఏర్పడింది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ప్రధాన సమస్యగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించుకున్న కూడా బెల్లంకొండ
శ్రీనివాస్ కి టైటిల్ దొరకని పరిస్థితి. కరెక్ట్ గా యాప్ అయ్యే టైటిల్ కోసం మేకర్స్ తెగ వెతుకుతున్నారట.