లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌ డే. 'మత్తు వదలరా' ఫేమ్‌ రితేష్‌ రానా ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. సరికొత్త లైన్ తో ఈ సినిమా మనం ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 8న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు టీం సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ సినిమా ట్రెయిలర్ ను ప్రతిష్టాత్మక దర్శకుడు రాజమౌళి చేతులమీదుగా ట్రెయిలర్ లాంచ్ చేయించారు. ఈ సందర్భంగా జక్కన్న ట్రెయిలర్ విడుదల చేసి, చెప్పిన మాటలు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా జోరందుకున్నాయి. ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. అంతలా రాజమౌళి ఏమన్నరయ్యా అంటే.

రాజమౌళి మాట్లాడుతూ.... "ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడమే గగనంగా మారింది. కానీ నా అభిప్రాయం ప్రకారం యూనిట్‌ మనసు పెట్టి కష్టపడి చేసిన ఏ సినిమాని కూడా ప్రేక్షకులు తమకై తాము వదులుకోవడానికి ఇష్టపడరు. ఏ సినిమా చేసినా సంపూర్ణంగా పూర్తి నిమగ్నతతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని  చేస్తే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారన్నది నా విశ్లేషణ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కామెడీ చేస్తే జనాలు పగలబడి నవ్వేలా వుండాలి, ఫైట్స్ వున్న సినిమా తీస్తే గ్రేటెస్ట్ యాక్షన్ తో కళ్ళు ఆశ్చర్యంతో మెరిసేలా  చూపించాలి. కానీ ఏదో చేశాము అంటే చేశాము అన్నట్లుగా సినిమాలు తీస్తే జనాలు థియేటర్లకు రావడం లేదు, సంపూర్ణంగా తీస్తే జనాలు వస్తారని భావిస్తున్నా అంటూ. .. అలా కష్టపడాలని సూచిస్తున్నాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు దర్శకుడు రాజమౌళి.

దాంతో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి అన్న మార్క్ వెనుక వున్న విజయ రహస్యాలు ఇవే నేమో అని అనిపించింది.  నెటిజన్లు కూడా మీరు సూపర్ సార్ కరెక్ట్ గా చెప్పారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: