సినీ రంగంలోని ఉండేటువంటి నటులు పైకి ఎంతో హుందాగా కనిపించినప్పటికీ.. తెరవ వెనక కూడా వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందికి ఎంత డబ్బులు ఉన్నా సరే నయం చేయలేని జబ్బులు బారిన పడినవారు ఉన్నారు ఇటీవలే ఒక హీరోయిన్ తన దీర్ఘకాలిక సంబంధిత వ్యాధి గురించి చెప్పుకుంది. ఎవరు దీనిని తప్పుగా అర్థం చేసుకోవద్దని వివరణ కూడా ఇచ్చింది. ఇక ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి షేనాజ్ ట్రెజరీ. తనకు ఉన్న వ్యాధి గురించి సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది.


ప్రస్తుతం ఈ హీరోయిన్ 40 సంవత్సరాలు. ఈమెకి ఉన్న వ్యాధి ప్రోసో ఫాగ్నోసియా. ఈ వ్యాధి బారిన పడినట్లుగా ఆమె తెలియజేసింది ఇది ఎలాంటి వ్యాధి అంటే ఎవరైనా వ్యక్తిని కొత్తగా కలిసినప్పుడు కానీ ఆ తర్వాత మళ్లీ అతని గుర్తుపట్టలేనంతగా ఆ వ్యాధి ఉంటుందట. ఇక అంతే కాకుండా కొన్నిసార్లు తరచుగా కలిసే వ్యక్తిని కూడా కొలసార్లు ఈజీగా మర్చిపోతూ ఉంటారని ఈ ముద్దుగుమ్మ తెలిపింది . ఈ వ్యాధి కారణంగా మనసులను చాలాసార్లు గుర్తుపట్టలేని సమయంలో తనని ఎదుటివారు మాత్రం ఎంతో పొగరు అనుకుంటూ ఉన్నారని.. కొన్నిసార్లు కొంతమంది తన మొహం మీద ఈ విషయాన్ని చెప్పేసినట్లుగా కూడా తెలిపింది.కానీ నా పరిస్థితి గురించి వారికి తెలిపే వరకు అర్థమయ్యేది కాదు అని ఈ విషయంలో పలుసార్లు నేను మానసికంగా కూడా ఆందోళన చెందానని షేనాజ్ ట్రెజరీ తెలియజేసింది. మొదట తనకు ఇలా ఎందుకు జరుగుతోంది అని వైద్యుల్ని అడిగినప్పుడు వారు కొన్ని పరీక్షలు చేసిన అనంతరం ఈ వ్యాధి గురించి తెలియజేసినట్లు ఈ ముద్దుగుమ్మ తెలిపింది. మెదడుకు సంబంధించిన ఈ వ్యాధి కొంతమంది ముఖాలను మాత్రమే గుర్తుపట్టలేని విధంగా చేస్తుంది అని అయితే.. అటుపక్క ఉన్న వ్యక్తి హెయిర్ స్టైల్ చూసి గుర్తుపట్టే విధంగా మాత్రమే అవకాశం ఉందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: