‘ఎఫ్ 3’ మూవీ విడుదల సమయం నుండి సినిమాల ప్రచారంలో పద్ధతి మార్చారు. తమ సినిమాకు టిక్కెట్ల రెట్లు పెంచలేదు అంటూ పదేపదే సినిమా ప్రమోషన్ ఫంక్షన్స్ లో ఇంటర్వ్యూలలో చెపుతున్నారు. అదే టెక్నిక్ ‘అంటే సుందరానికి’ కూడ అనుసరించారు. అయితే ఇంత ప్రచారం చేసినా ఆప్రచారం ఆసినిమాకు అంతగా కలిసిరాలేదు.


ఇప్పుడు అదే టెక్నిక్ ను ఈవారం విడుదలకాబోతున్న మారుతి గోపీచంద్ ల మూవీ ‘పక్కా కమర్షియల్’ కు అనుసరిస్తూ తమ సినిమాకు టిక్కెట్ రేటు పెంచలేదు అంటూ పదేపదే చెపుతున్నారు. వాస్తవానికి ప్రేక్షకులకు సినిమా నచ్చితే టిక్కెట్ల రేట్ల గురించి పెద్దగా పట్టించుకోరు అన్న అసలు విషయాన్ని దర్శక నిర్మాతలు మర్చిపోతున్నారు.


సినిమా టిక్కెట్ల రేట్ల గురించి ఎటువంటి ప్రచారం చేయకపోయినా కమలహాసన్ ‘విక్రమ్’ కుక్కను హీరోగా చేసి తీసిన ‘ఛార్లీ 77’ అద్భుత విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం ప్రేక్షకులు హీరోల చేత ఫైట్లు చేయిస్తూ హీరోయిన్ తో గ్లామర్ షోను చేయిస్తే ఆసినిమాను చూసే పరిస్థితులలో లేరు. దీనితో విడుదల కాబోతున్న ‘పక్కా కమర్షియల్’ మూవీ కథ చాల బాగుంటేనే ప్రేక్షకులు ధియేటర్లకు వస్తారు. లేదంటే సినిమా టిక్కెట్ల రెట్లు తగ్గించినా ప్రేక్షకులు ధియేటర్ల వైపుకు రావడంలేదు. దీనికి ఉదాహరణ గత వారం విడుదలైన 8 సినిమాల ఘోర పరాజయం.


ఆసినిమాలు కూడ తమ సినిమాలకు టిక్కెట్ల రెట్లు పెంచలేదు అంటూ ప్రచారం చేస్తున్నాయి. అయితే అలాంటి విషయాలను ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. దీనితో ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రమోషన్ సినిమా టిక్కెట్ల రేట్ల గురించి కాకుండా ఆసినిమాలోని పాజిటివ్ పాయింట్ చూపించి వెరైటీ కథ గురించి చెపితే బాగుంటుంది కాని కేవలం టిక్కెట్ల రేట్ల పై ఆధారపడటం ఏమిటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో గోపీచంద్ సినిమాలకు ఓపెనింగ్ కలక్షన్స్ రావడం అతి కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో ఈసినిమా హిట్ కావాలంటే మారుతి ఎదో ఒక మ్యాజిక్ చేసి తీరాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: