రౌడీ హీరో గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు యూత్లో ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ముఖ్యంగా రౌడీ హీరో సినిమా కోసం గత కొన్ని నెలలుగా ఆయన అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారు అంటే సినిమా రిలీజ్ చేయకపోతే దర్శక నిర్మాతలను కూడా కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అన్నంతగా అని చెప్పవచ్చు .ఇకపోతే అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో మొదటిసారి క్లాస్ హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో అల్లు అర్జున్ , ప్రభాస్ లాంటి స్టార్ హీరోల క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కెరియర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరియర్ను మొదలుపెట్టారు.

టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ లో సొంతం చేసుకున్న ఈయన కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ జాన్వి కపూర్,  దీపికా పదుకొనే , అలియా భట్ లాంటి వాళ్లు కూడా విజయ్ తో సినిమా చేయాలని డైరెక్టుగా తెలిపారు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకోవడం అంటే దాని వెనుక ఆయన కష్టం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే విజయ్ దేవరకొండకు స్టార్ హీరోయిన్లు అభిమానులుగా ఉండడమే కాకుండా యూత్ లో కూడా ఆయనకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఇక అమ్మాయిలు కూడా విజయ్ దేవరకొండ తో ఎక్కడికి వెళ్ళినా సరే ఫోటోలు, ఆటోగ్రాఫ్ ,  సెల్ఫీలు అంటూ పిచ్చెక్కిస్తూ ఉంటారు.

ఇక ఈ నేపథ్యంలోనే ఒక వీరాభిమాని .. లేడీ ఫ్యాన్  డా.చెర్రీ అనే అమ్మాయి ఏకంగా విజయ్ దేవరకొండపై తనకున్న ప్రేమను ఎలా చూపించాలో తెలియక అతని ఫోటోను ఏకంగా తన వీపుపై పర్మినెంట్గా పచ్చబొట్టు వేయించుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక దీన్ని చూసిన విజయ్ దేవరకొండ కూడా ఆశ్చర్యపోయాడు ఇకపోతే విజయ్ వెల్కం చూసిన ఆ అమ్మాయి పొంగిపోయి బాగోద్వేగానికి గురి అవ్వగా అందుకు సంబంధించిన వీడియోను కూడా నెట్టింట షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: