ఓ పక్క సినిమాలు మరో పక్క రాజకీయాలతో పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా ఉన్నారు. అక్టోబర్ 2 నుంచి తన రాజకీయ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. అయితే ఈలోగా మరో సినిమాని పూర్తి చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ క్రిష్ డైరక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. అయినా మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు.

కోలీవుడ్ లో ప్రత్యేకమైన సినిమాగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న వినోదయ సీతం సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ తో పాటుగా మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కూడా నటిస్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం పవన్ కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్ అడ్జెస్ట్ చేస్తుండగా అందుకుగాను భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. వినోదయ సీత రీమేక్ కోసం పవన్ కళ్యాణ్ 60 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.

మాత్రుక సినిమాని డైరెక్ట్ చేసిన సముద్రఖనినే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈమధ్యనే పవన్ కళ్యాణ్ మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా భీమ్లా నాయక్ సినిమా చేశాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ ఈ రీమేక్ ని చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. వెంకటేష్ తర్వాత టాలీవుడ్ లో రీమేక్ స్పెషలిస్ట్ గా పవన్ కళ్యాణ్ మారుతున్నారు. ఈ సినిమాల తర్వాత హరీష్ శంకర్ డైరక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా లైన్ లో ఉంచాడు పవన్ కళ్యాణ్. ఈ మూవీ మాత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వినోదయ సీతం రీమేక్ సినిమాని తన పోర్షన్ వరకు పూర్తి చేసి ఒక ఆరు నెలల వరకు పూర్తిగా రాజకీయాలకు కేటాయించనున్నారు పవన్ కళ్యాణ్.  

మరింత సమాచారం తెలుసుకోండి: