టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చిన్న సినిమాల పరిస్థితి ఇప్పుడేమీ బాగోలేదు. బాగా ఉంటే తప్ప సదరు సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. ఆ విధంగా ఈ ఏడాది వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించలేక పోయాయి. భారీ నష్టాలను చవిచూడవలసి వచ్చింది. ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడం ఈ చిన్న సినిమాలకు అతిపెద్ద మైనస్ అయ్యింది అని చెప్పాలి.

బాగున్న చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. పెద్ద సినిమాలైతే అది కూడా బాగా ఉంటే తప్ప వారు థియేటర్లకు వెళ్లడం లేదు.  ఇలాంటి పరిస్థితుల్లోనూ చిన్న సినిమా గా వచ్చి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది అదే డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ హీరో గా ప్రేక్షకులను అలరించి భారీ విజయం అందుకున్న డీజే టిల్లు సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కడానికి రంగం సిద్ధమవుతోంది. దీంతో ఈ సినిమా అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా కామెంట్లు పెట్టారు. 

అయితే మొదటి భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు విమల కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం అందించడం లేదు. ఈ దర్శకుడు మరొ క సినిమా మొదలుపెట్టడంతో ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించబోతున్నాడు హీరో సిద్దు జొన్నలగడ్డ. నటన వరకు అయితే ప్రేక్షకులను బాగానే అలరించిన ఈ హీరో ఇప్పుడు దర్శకత్వం పరంగా ప్రేక్షకులను ఎలా అలరిస్తాడన్నదే ఇక్కడ అసలు విషయం. అందులోనూ ఓ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ చేయాలి అంటే నిజంగా కత్తి మీద సాము లాంటిదే అని చెప్పాలి. మరి పూజా కార్యక్రమాలు జరుపుకుని షూటింగ్ కు వెళ్లడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా మొదటి భాగం లాగానే సూపర్ హిట్ అవుతుందా అనేది చూడాలి.  ఈ సినిమా కు సంబంధించి మిగితా వివరాలు ఇంకా తెలియరాలేదు. త్వరలోనే చిత్ర బృందం ఈ విశేషాలను వెల్లడించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: