చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమాని డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నది. ఈ సినిమా ఫస్ట్ లుక్ సంబంధించి తాజాగా ఒక అప్ డేట్ రావడం జరిగింది. గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను జూలై 4న సాయంత్రం 5:45 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించడం జరిగింది.



ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమా రాక కోసం ప్రజలు వర్షంలో గోడుగులు పట్టుకుని నిలుచున్నట్లుగా ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఇక చిరంజీవి కెరియర్ లో ఈ సినిమా 153వ చిత్రంగా తేరకెక్కించడం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. మొదటిసారి సల్మాన్ ఖాన్ తెలుగు హీరో సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇందులో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉన్నట్లు సమాచారం. చిరంజీవి కోసం ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేసిన డాన్స్ మాస్టర్ ప్రభుదేవా కొరియోగ్రాఫర్ చేశారు.


ఇక ఈ సినిమాలో సౌత్ స్టార్ గా పేరుపొందిన హీరోయిన్ నయనతార నటిస్తున్నది. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవు కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాలు అతిధి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్స్ కూడా పనిచేశారు. గాడ్ ఫాదర్ సినిమా మలయాళం లో బ్లాక్ బాస్టర్ సినిమాకి రిమెక్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పలు మార్పులు చేశారు అన్నట్లుగా సమాచారం. ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా కోసం మెగా అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరో మూడు రోజులలో విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: