ప్రస్థుతం టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక విచిత్రమైన పరువు వేదిస్తోంది. అతివృష్టి అనావృష్టి అన్నట్లుగా ఈసంవత్సరం పెద్ద సినిమాలు అన్నీ జూన్ నెల లోపున క్యూ కట్టడంతో జూలై నెల నుండి డిసెంబర్ వరకు ప్రేక్షకులు చూడటానికి చెప్పుకోతగ్గ పెద్ద సినిమాలు లేవు.


ప్రస్తుతం సెట్స్ పై ఉన్నది చిరంజీవి బాలకృష్ణల సినిమాలు మాత్రమే. టాప్ యంగ్ హీరోల సినిమాలు ఏవీ ఇప్పట్లో విడుదల కావు. టాప్ యంగ్ హీరోలు అంతా రెస్ట్ మూడ్ లో ఉన్నారు. పండుగల సీజన్ లో సంక్రాంతి తరువాత దసరా చెప్పుకోతగ్గ సీజన్ అయినప్పటికీ ఆపండుగలను టార్గెట్ చేస్తూ చిరంజీవి బాలకృష్ణల సినిమాలు ఉంటాయి అనుకున్నారు అంతా. అయితే బాలయ్యకు కరోనా రావడంతో మరో నెలరోజుల వరకు సినిమా షూటింగ్ లకు వచ్చే పరిస్తితిలేదు.


దీనితో చిరంజీవి ‘లూసీఫర్’ ఒక్కటే వచ్చేలా కనిపిస్తోంది. ఈ సంవత్సరం రెండవ భాగంలో విడుదలయ్యే సినిమాలు అన్నీ మిడిల్ రేంజ్ సినిమాలు లేదంటే కుప్పలు కుప్పలుగా వచ్చే చిన్న సినిమాలు. ఈసినిమాలు అన్నింటి పై ఎటువంటి భారీ అంచనాలు లేవు. ప్రస్తుత పరిస్థితులలో ఒక మంచి ధియేటర్ కు సంవత్సరానికి కోటి రూపాయలు అద్దె చెల్లించ వలసిన పరిస్థితి. దీనికితోడు చిన్న సినిమాలకు మీడియం రేంజ్ సినిమాలకు కలక్షన్స్ పెద్దగా లేకపోవడంతో బైక్స్ కార్ల స్థాండ్ లు ధియేటర్ల క్యాంటిన్స్ వెలవెలపోతూ ఉండటంతో అసలు ధియేటర్లు భవిష్యత్ లో నడుస్తాయా అన్న సందేహాలు చాలామందికి వస్తున్నాయి.


ఇది ఇలా ఉంటే సినిమాలు విడుదలైన 50 రోజులు తరువాత మాత్రమే ఓటీటీ లలో విడుదలచేయాలి అని నిర్మాతలు తీసుకున్న కొత్త నిబంధన ఎంతమంది నిర్మాతలు ఖచ్చితంగా ఫాలో అవుతారు అన్న సందేహం చాలామందిలో కలుగుతోంది. ఒక సినిమా విడుదల అయ్యాక ఆ మూవీ క్రేజ్ నాలుగు వారాలు ఉండటమే కష్టమైపోతున్న ఈరోజులలో ఒక సినిమాను 50 రోజుల తరువాత ఓటీటీ లో విడుదల చేస్తే ఎవరు చూస్తారు అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: