కృష్ణంరాజు నటవారసుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్ మొదట్లో సినిమాలలోకి రావాలని ఎప్పుడు ఆశించలేదు. అతని దృష్టి అంతా వ్యాపారం పై ఉండేది. అయితే కొన్ని అనుకోని పరిస్థితులు వల్ల తాను హీరోగా మారాను అంటూ స్వయంగా ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.


ప్రభాస్ కెమెరా ముందుకు వచ్చి 20సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కృష్ణంరాజు ఇంటిలో ప్రభాస్ అభిమానుల సమావేశం జరిగింది. ఈసమావేశానికి వందలాదిగా అభిమానులు వచ్చారు. ప్రభాస్ నటించిన మొదటి చిత్రం ‘ఈశ్వర్’ మూవీ షూటింగ్ మొదలై 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా జరిగిన అభిమానుల సమావేశంలో కృష్ణంరాజు భావోద్వేగానికి లోనయ్యాడు. హీరోగా ప్రభాస్ తన కెరియర్ మొదలుపెట్టినప్పుడు అతడు ఈస్థాయికి వెళతాడని తాను కలలో కూడ ఊహించలేదని ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా హీరో మాత్రమే కాదు పాన్ వరల్డ్ హీరో అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇంతటి ఉన్నత స్థాయి ప్రభాస్ కు రావడం వెనుక అతడి స్వయంకృషి ఎంతో కీలకం అంటూ అతడి పై విపరీతమైన ప్రశంసలు చేసాడు.


అప్పట్లో ‘ఈశ్వర్’ మూవీకి దర్శకత్వం వహించిన దర్శకుడు జయంత్ మాట్లాడుతూ ప్రభాస్ మొదటిసినిమా తాను డైరెక్ట్ చేస్తున్నప్పుడు అతడి కళ్ళల్లో ఒక కాంతి చూశానని దానితో ఆనాడే అతను టాప్ హీరో అవుతాడు అని జోశ్యం చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసాడు. వాస్తవానికి ప్రభాస్ నటించిన మొదటి సినిమా పెద్దగా ఆడలేదు. ఆతరువాత ప్రభాస్ నటించిన సినిమాలకు కూడ పెద్దగా స్పందన రాలేదు. ‘వర్షం’ ‘ఛత్రపతి’ మూవీల నుండి ప్రభాస్ కెరియర్ కు ఎదురు లేకుండా పోయింది.


ప్రస్తుతం మళ్ళీ వరస ఫ్లాప్ లతో సతమతమౌతున్నాడు. అయినప్పటికీ అతడి మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరిగి పోతోంది. తాను నటించే సినిమాకు 100 కోట్ల స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని భారీస్థాయి గ్రాఫిక్స్ వర్క్స్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీ ప్రభాస్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారిన విషయం తెలిసిందే..  



మరింత సమాచారం తెలుసుకోండి: