నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అయితే నాని తాజాగా అంటే సుందరానికి సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలావుంటే తాజాగా ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం దసరా .ఇక  డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.ఇకపోతే ఈ సినిమా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ ను శుక్రవారం పునఃప్రారంభించారు.కాగా  ఈ భారీ షెడ్యూల్ లో మొత్తం ప్రధాన తారాగణం షూట్‌ లో పాల్గొంటున్నారు.పోతే  ఇందుకోసం హైదరాబాద్‌ లో భారీ సెట్‌ వేశారు. 

అయితే ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చేయని మాస్ రోల్‌ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో  హెయిర్ స్టయిల్, గుబురు గడ్డంతో రగ్గడ్ లుక్‌ లో కనిపించనున్నారు. పోతే నాని ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పడం విశేషం.ఇకపోతే నాని మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న దసరా భారీ స్థాయిలో రూపొందుతోంది. ఇదిలావుంటే తాజాగా విడుదల చేసిన స్టిల్‌లో నాని లుంగీ, బనియన్‌లలో మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఇక కోల్ మైన్ పై నిలబడి బీడీ తాగుతున్న లుక్ ఫుల్ మాసీగా వుంది. కాగా నాని ఫుల్ లెంత్ మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలకో కనిపిస్తున్న ఈ చిత్రం గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపధ్యంలో జరుగుతుంది.

అయితే జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ ఈ చిత్రంలో నాని సరసన కథానాయికగా కనిపించనుంది. ఇక ఈ చిత్రం గత షెడ్యూల్‌లో షూటింగ్ స్టంట్ డైరెక్టర్ అన్బరీవ్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించారు.అంతేకాక  అంతకు ముందు నాని, కీర్తి సురేష్‌లపై ఓ భారీ పాట చిత్రీకరించారు.ఇక ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాట కొరియోగ్రఫీ అందించి యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో 500 మంది డ్యాన్సర్లతో పాటని అద్భుతంగా చిత్రీకరించారు.అయితే  ఇప్పటికే విడుదలైన ‘దసరా’ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. ఇక నాని మాస్ గెటప్, టెర్రిఫిక్ అవతార్ ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది.అయితే  సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.పోతే  ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: