ఈసంవత్సరం సంక్రాంతి రేస్ కు విడుదలైన ‘బంగార్రాజు’ ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. దీనికితోడు సీనియర్ హీరోలు బాలకృష్ణ చిరంజీవి వెంకటేష్ లు వరసగా సినిమాలు చేస్తూ చాల బిజీగా ఉంటూ ఉంటే నాగ్ మాత్రం తన సినిమాల ఎంపిక విషయంలో చాల స్లోగా వ్యవహరిస్తున్నాడు అన్నకామెంట్స్ వస్తున్నాయి.


రాజకీయాల నుండి సినిమాలలోకి యూటర్న్ తీసుకున్న చిరంజీవి ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలలో నటిస్తూ మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. బాలకృష్ణ కూడ వరసగా సినిమాలు చేస్తున్నాడు. వెంకటేష్ అయితే రానా తో కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం ఒక భారీ వెబ్ సిరీస్ కూడ చేస్తున్నాడు. అయితే నాగార్జున నటించి విడుదలకు సిద్ధంగా ఉన్నవి రెండే రెండు సినిమాలు ‘గరుడువేగా’ మూవీ దర్శకుడుతో నాగార్జున ఒక హర్రర్ మూవీ చేసాడు.


అయితే ఆమూవీ ఎప్పుడు విడుదల అవుతుందో క్లారిటీ లేదు. ‘బ్రహ్మాస్త్ర’ మూవీలో నాగ్ నటించినప్పటికీ ఆమూవీలో అతడి పాత్ర చాల చిన్నది. దీనితో ఆమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అయినప్పటికీ నాగ్ కు ప్రత్యేకంగా కలిసి వచ్చేది లేదు. వాస్తవానికి అనేకమంది యంగ్ దర్శకులు నాగార్జునతో సినిమాలు తీయడానికి ముందుకు వస్తున్నప్పటికీ ఎందుకనో నాగ్ ఆకధలు వినే విషయంలో పెద్దగా ఆశక్తి కనపరచడంలేదు అన్నవార్తలు కూడ వస్తున్నాయి. దీనితో నాగ్ తన కెరియర్ విషయంలో ఎందుకు స్లో అవుతున్నాడు అంటూ చాలామంది ఆశ్చర్యపడుతున్నారు.


నాగార్జున సినిమాలకు మార్కెట్ తగ్గడంతో పాటు అతడి మూవీలకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావడంలేదు. ఈవిషయాలు కూడ నాగార్జునను కొంతవరకు నిరుత్సాహ పరిచాయ అన్నసందేహాలు వస్తున్నాయి. త్వరలో మా టివి ప్రారంభించబోతున్న ‘బిగ్ బాస్ సీజన్ 6’ హోస్ట్ చేయడానికి నాగార్జున అంగీకరించాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈసారి నాగ్ ను బిగ్ బాస్ హోస్ట్ గా ఒప్పించడానికి స్టార్ ‘మా’ సంస్థ నాగ్ కు గత సీజన్ కన్నా ఎక్కువ పారితోషికం ఇవ్వబోతోంది అని తెలుస్తోంది. దీనితో నాగార్జున సినిమాలలో నటించి ఆ సినిమాల సక్సస్ గురించి టెన్షన్ పడేకన్నా బుల్లి తెర కార్యక్రమాల హోస్ట్ గా కొనసాగితే డబ్బుతో పాటు టెన్షన్ లేకుండా అన్ని రకాల బాగుంటుంది అన్న ఆలోచనలలో నాగార్జున ఉన్నట్లు అనిపిస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: