యంగ్ హీరో, హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలు కలిసి చేస్తే పుకార్లు రావడం ఇండస్ట్రీలో సహజమే. ఇలాంటి వార్తలు చాలానే విన్నాం. అయితే ఇదే తరహాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠి పై కూడా ఈ మధ్య కాలం లో రూమర్స్ వెల్లువెత్తిన విషయం తెలిసిందే. వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు తెగ హల్ చల్ చేశాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో వరుణ్ గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్నారు అని ఎట్టకేలకు తమ ప్రేమ విషయం గురించి ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఇపుడు పెళ్లిచేసుకోబోతున్నారు అని పుకార్లు వినిపించాయి.

మెగా ప్రిన్స్ తో పెళ్ళికి రెడీ అయిన నేపథ్యం లో లావణ్య ఈ మధ్య కొత్తగా ఏ సినిమాకి సైన్ చేయలేదని. అందుకే ఆమె మరో ప్రాజెక్ట్ కి కమిట్ అవ్వలేదని.. ఇకపై సినిమాలు చేస్తుంది అన్న నమ్మకం కూడా లేదని ఇలా చాలా వార్తలు షికారు చేయగా చివరికి లావణ్య వీటిపై ఓసారి మాట్లాదామా వద్దా అన్నట్టుగా స్పందించారు. నేను కొత్త ప్రాజెక్టు లకు ఒప్పుకోవడానికి అసలు కారణం వేరే ఉంది. తెలుగు , తమిళ భాషల్లో నాకు మంచి గుర్తింపు ఉంది. అభిమానులు నా సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు.

అందుకే నా దగ్గరికి వస్తున్న కథల్లో ది బెస్ట్ కోసం వెయిట్ చేస్తున్న అంటే తప్ప మరే ఉద్దేశం లేదు అంటూ వివరణ ఇచ్చింది.. కానీ వరుణ్ తో పెళ్ళి అన్న మాట గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక అటు వైపు మన మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఈ విషయం పై ఒక్కసారి కూడా స్పందించని నేపథ్యంలో మరో సారి వీరి పెళ్లి వార్తలు వేగం పుంజుకుంటున్నాయి. ఇద్దరికీ ఏ ఒక్కరు కాస్త గట్టిగా ఖండిస్తే తప్ప ఇప్పట్లో ఇవి ఆగేలా లేవు.  వీరిద్దరూ కలిసి అంతరిక్షం మరియు మిస్టర్ చిత్రాలలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ సమయం లోనే వీరి మద్య ప్రేమ చిగురించింది అని వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ వార్త గురించి ఈ రూమర్స్ ఎప్పుడు ఎండ్ అవుతాయి అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: