బుల్లితెర సీరియల్స్ లో నటించి తమ అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది హిమజ. ఆ తర్వాత బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకుని ప్రతి తెలుగింటికి దగ్గరైంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడు క్రేజ్ పెరిగిపోవడంతో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇక ఎన్నో దుకాణాలు నగల దుకాణాల ప్రారంభోత్సవాలు కార్యక్రమాలకు కూడా ముఖ్య అతిథిగా వెళ్తూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ.


 ఒకవైపు నటన పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అటు సోషల్ మీడియా లో మాత్రం ఎప్పుడూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది.  ఇక ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను యూట్యూబ్ వేదికగా పెంచుకుంటూనే ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆస్క్ మీ అనే ఒక చిట్ చాట్ సెషన్ నిర్వహించింది.ఇందులో భాగంగా ఎక్కువ మంది హిమజా పెళ్లి గురించి అడిగారు.. ఈ క్రమంలోనే ఇటీవల తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ అమ్మడు.


 ప్రస్తుతం తనకు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచనలు లేవని వాస్తవానికి అయితే అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదు అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. తనకు పీస్ ఆఫ్ మైండ్ ఫ్రీడం కావాలని చెప్పుకొచ్చింది బిగ్ బాస్ హిమజా. దీంతో హిమజ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోతున్నాయ్ అని చెప్పాలి. ప్రస్తుతం పెళ్లికి దూరంగా తనకు నచ్చినట్లుగా బ్రతుకుతున్న హిమజా పెళ్లి తర్వాత అలాంటి స్వేచ్ఛకు దూరం అవుతానని భావిస్తున్నట్లు ఆమె మాటల్లో తెలుస్తుంది. దీంతో హిమజా పెళ్లి చేసుకోను అని చెప్పడంతో అభిమానులు అందరూ షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: