నూనూగు మీసాలు వస్తున్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ మనవడు గా హీరోగా ఎంట్రీ ఇచ్చి మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు అన్న విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో మొదట్లోనే బ్లాక్బస్టర్ విజయాలతో ఏకంగా ఇండస్ట్రీ రికార్డులను కూడా తిరగరాశాడు అని చెప్పాలి. తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే నిరూపించుకున్నాడు. ఇప్పుడు ప్రతి సినిమాతో ఇది నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ ను స్టార్ హీరోగా మార్చేసిన సినిమా ఏది అంటే అందరూ చెబుతారు సింహాద్రి అని.


 అప్పటికే రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా వచ్చింది.  తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి సినిమా వచ్చింది. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. 21 ఏళ్లకే సింహాద్రి సినిమా తో మాస్ ప్రేక్షకులందరికీ పూనకాలు తెప్పించాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటు ఏ థియేటర్లో చూసిన కూడా థియేటర్లో సింహాద్రి సినిమా గర్జన వినిపించింది.  55 కేంద్రాల్లో 175 రోజులు కూడా పూర్తి చేసుకుందంటే అది మామూలు విషయం కాదు. అయితే ఇలా జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా నిలబెట్టిన సింహాద్రి సినిమా వెనుక చాలా ఫ్లాష్బ్యాక్ ఉందట.



 సింహాద్రి సినిమా కి మూలం కమలహాసన్ శ్రీదేవి జంటగా కలిసి నటించిన వసంత కోకిల సినిమా అనే విషయం ఇపుడు హాట్ టాపిక్గా మారింది. బాలు మహేంద్ర దర్శకత్వంలో 1992 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. యాక్సిడెంట్ లో గతం మర్చిపోయిన శ్రీదేవిని కమల్ హాసన్ చేరదీస్తాడు. తక్కువ సమయంలోనే ఇద్దరు స్నేహితులు అవుతారు. తర్వాత శ్రీదేవి గతం గుర్తుకు వచ్చి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పోతుంది. ఇక తర్వాత కమల్ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అయితే ఈ సినిమా చూస్తూ క్లైమాక్స్ గుండెల్లో గునపం పొడిచినట్లు లేదు అంటూ విజయేంద్రప్రసాద్ మాట్లాడడంతో.. ఇక హీరో ప్రేమించిన యువతి హీరోను గుండెల్లో గునపం గుచ్చినట్లు మనం క్లైమాక్స్ ప్లాన్ చేద్దాం అది సింహాద్రి రాశారట.



 ఇక ఫ్లాష్బ్యాక్ ఏదైనా ప్రదేశాన్ని తీసుకోవాలని భావించి కేరళను తీసుకున్నారట. ముందుగా దీన్ని బాలకృష్ణతో బి.గోపాల్ దర్శకత్వంలో తీయాలని అనుకున్నారు. కానీ అప్పటికే బి.గోపాల్ బాలయ్య పలనాటి బ్రహ్మనాయుడు సినిమాతో బిజీగా ఉన్నారు. దీంతో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళిదర్శకత్వంలో ఈ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: