యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరి కొన్ని రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ను చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది.

అలాగే ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నట్లు, అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనునట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ జూన్ నెల ఉండే ప్రారంభం కాబోతున్న కొన్ని వార్తలు వచ్చాయి. కాకపోతే ఎన్టీఆర్సినిమా కోసం కొంత బరువు తగ్గడానికి ప్రయత్నించడం వల్ల ఈ సినిమా షూటింగ్ కొంత ఆలస్యం అవుతున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాగే ఆ సమయంలో కొరటాల శివ కూడా ఈ సినిమా కథ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో షూటింగ్ ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్నా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. మొదట్లో ఈ సినిమాలో  అలియా భట్ నటించబోతున్నట్లు కొన్ని కథనాలు వచ్చాయి.

దాదాపు ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కాక పోతే అనూహ్యంగా చివరి నిమిషంలో ఆలియా భట్మూవీ నుండి తప్పుకుంది. ఆతర్వాత కియారా అద్వానీ , రష్మిక మందన , సాయి పల్లవి ఇలా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కాక పోతే ఇప్పటి వరకు కూడా చిత్ర బృందం ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: