నిన్న శుక్రవారం రోజున టాలీవుడ్ థియేటర్ల లోకి కొత్తగా పలు సినిమాలు యధావిధిగా రిలీజ్ అయ్యాయి. అయితే విడుదల అయిన చిత్రాల్లో ఏది బెస్ట్ ఇంతకీ సాహో సినిమాలో విలన్ గా చేసిన అరుణ్ హీరోగా చేసిన ఏనుగు సినిమా ఎలా ఉంది అంటే...!!! ఇదిగో టాక్ ఇలా వినిపిస్తోంది. నిన్న గోపీచంద్ సినిమా పక్కా కమర్షియల్ తో పాటుగా ఏనుగు సినిమా కూడా రిలీజ్ అయ్యింది. కొందరు తమిళ హీరోలు వారి చిత్రాలను తెలుగులోనూ డబ్ చేసి టాలీవుడ్ లోను తమ మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటారు. అయితే తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉన్న హీరో అరుణ్ విజయ్. అయితే ఈ హీరో తన సినిమాలను తెలుగులో డబ్ చేయలేదు.

కానీ ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో విలన్ గా చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అయితే ఇపుడు నేరుగా తెలుగులో ఓ సినిమా ట్రై చేద్దాం అని ఏనుగు చిత్రంతో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే మిగిలిన సినిమాలతో పోలిస్తే గోపీచంద్ మూవీ బెస్ట్ గా కనిపిస్తూ ఉండటంతో ఈ సినిమా థియేటర్లకు వెళుతున్న కొద్ది మంది జనం కూడా అటు వైపు వెళ్లిపోతున్నారు. దాంతో  ఈ సినిమాపై ఆ ప్రభావం పడి కలెక్షన్ లు పెద్దగా రావడం లేదు అని వినిపిస్తోంది. నిజానికి ఏనుగు స్టోరీ కాస్త రోటీన్ గానే ఉన్న అరుణ్ విజయ్ యాక్షన్ చాలా బాగుంది అని అలాగే స్క్రీన్ ప్లే బాగుందని టాక్ వినిపిస్తోంది.

ఇలాగే కనుక పాజిటివ్ టాక్ పెరిగితే ఈ వారంలో కలెక్షన్లు బాగా పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు. అరుణ్ విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ నటన చాలా బాగున్నాయి అని ప్రశంసలు వినపడుతున్నాయి. ఆర్టిస్టులు కూడా బాగా సెట్ అయ్యారు. పర్లేదు ఓసారి చూసేయొచ్చు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: