మహేష్ సినిమాలో కూడా జక్కన్న సెంటిమెంట్ ను వదలడా..
రాజమౌలి.. ఆయన పేరుకు పరిచయం అక్కర్లేదు..స్టార్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు.. అన్నీ సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో పాటు ప్రపంచ స్థాయి రికార్డులను కూడా అందుకున్నాయి.అతని తో సినిమాలు కాస్త ఆలస్యం కానీ హిట్ అవ్వడం మాత్రం పక్కా అని అందరికి తెలుసు. ఇటీవల ట్రిపుల్ సినిమాను తెరకెక్కించిన ఆయన ఆ సినిమా భారీ సక్సెస్ ను అందుకుంది.ఆ తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు చెసెందుకు రెడీ అయ్యాడు. జక్కన్న ఆర్ఆర్ఆర్ మేనియా నుండి పూర్తిగా బయటకు వచ్చి, తన నెక్ట్స్ ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఎప్పటినుండో ఓ సినిమా చేస్తాడని చెబుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు ముహూర్తం కుదిరింది.


ఇక ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను కూడా రెడీ చేశాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో యూనివర్సల్ సబ్జెక్ట్‌గా తెరకెక్కించేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో రాజమౌళి మరోసారి తనకు కలిసొచ్చిన 'డబుల్' సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలను చూస్తే.. అందులో ఇద్దరు హీరోలను పెట్టి వరల్డ్‌వైడ్ సక్సెస్ అందుకున్నాడు. ఒక హీరోను ఎలివేట్ చేయాలంటే, మరొక హీరో కావాల్సిందే అనే లాజిక్‌ను జక్కన్న బాగా వాడుతున్నాడు. అందుకే బాహుబలిలో ప్రభాస్‌తో పాటు రానా దగ్గుబాటి, ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్‌తో పాటు జూ.ఎన్టీఆర్‌లను హీరోలుగా పెట్టి సినిమాలు తీశాడు..


మహేష్ బాబుతో చేయబోయేది మల్టీస్టారర్ సినిమా కాదని పలుమార్లు చెబుతూ వచ్చిన జక్కన్న, ఆ మాటను పక్కనబెట్టి మరో హీరో కోసం వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు సినిమాలో ఓ కీలక పాత్రలో మరో క్రేజ్ ఉన్న హీరో అయితే బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నాడట. అందుకే ఈ సినిమాలో ఆ పాత్రను నేచురల్ స్టార్ నానితో చేయించాలని జక్కన్న ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మహేష్‌తో చేయబోయేది సోలో హీరో సినిమా అని చెప్పి, ఇప్పుడు డబుల్ సెంటిమెంట్‌ను మరోసారి మహేష్ సినిమాలో కూడా వాడేస్తావా జక్కన్న? అంటూ మహేష్ అభిమానులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో.. ఒకవేళ ఇదే నిజమైతే జక్కన్న ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి.. మహేష్ సినిమా పై ఇప్పటికే టాలివుడ్ లో అంచనాలు పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: