నాచురల్ స్టార్ నాని మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో నటిస్తున్న సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని పాన్ ఇండియా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోందట.ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభించి ఉండగా కొద్దిరోజులుగా షూటింగ్ కి విరామం ఇచ్చారట .


తాజాగా ఈ సినిమా ఓ భారీ షెడ్యూల్ చిత్రీకరణ నేడు హైదరాబాదులో ప్రారంభమైందని సమాచారం.ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం హైదరాబాదులో భారీ సెట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నాని ఇదివరకు ఎప్పుడు కనిపించని విధంగా రా హెయిర్ స్టయిల్, గుబురు గడ్డంతో రగ్గడ్ లుక్‌ లో సందడి చేయనున్నారు. అలాగే ఈ సినిమాలో నాని పూర్తిగా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పనున్నారట. ఈ భారీ షెడ్యూల్ చిత్రీకరణలో మొత్తం ప్రధాన తారాగణం పై షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.


  ఈ సినిమాని గోదావరి ఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపధ్యంలో తెరకెక్కుతోందట.ఇన్ని రోజులు నాని క్లాస్ లుక్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. అయితే మొదటిసారిగా ఇలా మాస్ లుక్ లో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 'దసరా' గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. అయితే నాని నటించిన అంటే సుందరానికి సినిమా ప్రమోషన్, విడుదల కార్యక్రమాలలో బిజీగా ఉండటం వల్ల కొద్ది రోజులపాటు ఈ సినిమాకి విరామం ఇచ్చారట.. ఈ క్రమంలోనే ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు డైరెక్ట్ శ్రీకాంత్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. ఇక నేడు ఈ సినిమా షూటింగ్ యధావిధిగా పునః ప్రారంభమైందని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: