పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతుండగా ఇప్పటికే సగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో క్లారిటీ లేదు.


 సినిమాతో పాటు పవన్ వినోదాయ సిత్తం రీమేక్ కు, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు సినిమాల షూటింగ్ లు కూడా మొదలుకావాల్సి ఉంది.


అయితే ఏపీలో ఎన్నికలకు మరో 20 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నారట.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతి త్వరలో జనవాణి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారని సమాచారం కూడా అందుతోంది. ఈ కార్యక్రమం కోసం పవన్ కళ్యాణ్ ఐదు వారాల సమయం కేటాయించనున్నారని తెలుస్తోంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తే ఐదు వారాల నుంచి ఈ సమయం మరింత పెరిగినా ఆశ్చర్యం అక్కర్లేదట.


 


జనవాణి కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి సమస్యలను అర్జీల రూపంలో తీసుకోనున్నారట.. ఆ అర్జీలకు రసీదులు కూడా ఇచ్చి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయనున్నారని తెలుస్తుంది.. ఈ ప్రోగ్రామ్ కోసం కళ్యాణ మండపాలను బుకింగ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. పవన్ హాజరయ్యే కార్యక్రమం అంటే జనం నుంచి కూడా స్పందన భారీగా ఉంటుందనే విషయం తెలిసిందే.


 


పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను పరిష్కరించడం ద్వారా జనసేన అభివృద్ధి కోసం కృషి చేయాలని అనుకుంటున్నారట . 2024 ఎన్నికల్లో జనసేన మెరుగైన ఫలితాలను సొంతం చేసుకుంటుందని పవన్ అభిమానులు భావిస్తున్నారట.. పవన్ పాలిటిక్స్ లో బిజీ అవుతుండటంతో ఆయన నటిస్తున్న సినిమాలు కచ్చితంగా ఆలస్యం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలను, రాజకీయాలను ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారో మరి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: