తెలుగు సినీ ప్రేక్షకులకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.


అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడట విజయ్ దేవరకొండ. యూత్ లో విజయ్ దేవరకొండకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. విజయ్ ఫ్యాన్స్ లో అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిల సంఖ్యనే అయినా ఎక్కువగా ఉందని తెలుస్తుంది.. ప్రస్తుతంవిజయ్ దేవరకొండ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.


ఇప్పటివరకు విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు ఏవి పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాకపోగా ఈ లైగర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. విజయ్ దేవరకొండ అంచనాలు అన్నీ కూడా ఈ సినిమా పైనే పెట్టుకున్నాడట.. అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని విజయ్ దేవరకొండ అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.



ఇది ఇలా ఉంటే లైగర్ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ ను కాస్త డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయ్‌ దేవరకొండ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తొంది. నటన పరంగా మానసికంగా, శారీరకంగా ఈ సినిమా కోసం నా సర్వస్వం పెట్టాను..ఇది ఎంతో ఛాలేంజింగ్‌ రోల్‌.. నేను మీకు అన్ని ఇస్తాను..త్వరలో లైగర్‌ వచ్చేస్తుంది అని కామెంట్ చేశాడు విజయ్.ఈ కామెంట్ కు ఒక ఫొటో కూడా పోస్ట్ చేశాడు రౌడీ హీరో. ఈ ఫొటోలో విజయ్‌ దేవరకొండ నగ్నంగా ఉండి మధ్యలో రోజా పూలు అడ్డుపెట్టుకుని కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఈ పిక్‌ చూస్తుంటే అమీర్ ఖాన్‌ పీకే సినిమా పోస్టర్‌ను గుర్తు చేస్తుంది. ఇక విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఆ ఫోటో పై కేవలం అభిమానులకు మాత్రమే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా తెగ స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: