2022 సంవత్సరంలో సగభాగం ముగిసి పోవడంతో ఈ అర్థ సంవత్సరంలో ఇండస్ట్రీలో పరిస్థితి ఏమైంది అన్న ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. గడిచిన 6నెలల్లో ఈనో సినిమాలు విడుదల అయినప్పటికీ నూటికి నూరు పాళ్ళు నిజయితీగా నిర్మాతలకు అదేవిధంగా బయ్యర్లకు కాసులు వర్షం కురిపించిన సినిమా ‘డిజే టిల్లు’ మాత్రమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఈసినిమా 5 కోట్ల పెట్టుబడితో పూర్తి చేసిన నిర్మాతలకు 4 నుంచి 5 రెట్లు లాభాలు వచ్చాయని అంటున్నారు. అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ బయ్యర్లకు కూడ ఈ స్థాయిలో లాభాలు రాలేదని కొన్ని ఏరియాలలో అయితే ఈసినిమాకు సంబంధించి బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడ అతి కష్టంగా మారింది అని అంటారు.


పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మహేష్ ‘సర్కారు వారి పాట’ మూవీలకు భారీ ఓపెనింగ్ కలక్షన్స్ వచ్చినప్పటికీ ఆరెండు సినిమాలు కూడ అతి కష్టం పై బ్రేక్ ఈవెన్ అయ్యాయి అని అంటారు. ఇదే పరిస్థితి ‘ఎఫ్ 3’ బయ్యర్లది అన్నమాటలు కూడ వినిపిస్తున్నాయి. ఇక ‘రాథే శ్యామ్’ ‘ఆచార్య’ సినిమాల బయ్యర్ల కష్టాలు చెప్పడానికి కూడ ఊహకు అందని విధంగా ఉన్నాయి అని అంటారు. అయితే ఈసినిమాలు అన్నీ టాప్ హీరోల సినిమాలు కావడంతో బయ్యర్ల పరిస్థితి బయటకు చెప్పుకోలేనిది అని టాక్. అయితే డబ్బింగ్ సినిమాలుగా విడుదలైన ‘కేజీ ఎఫ్ 2’ ‘విక్రమ్’ సినిమాలు మటుకు ఆసినిమాల బయ్యర్లకు కాసుల వర్షం కురిపించడంతో మళ్ళీ బయ్యర్లకు డబ్బింగ్ సినిమాల పై ఆశ పెరిగింది.


మధ్యలో వచ్చిన ‘మేజర్’ బయ్యర్లకు లాభాలను తెచ్చిపెడితే  ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లు అనుకున్నంతగా రాకపోవడంతో ఎబోవ్ యావరేజ్‌గా నిలిచింది. ‘సమ్మతమే’ అనే చిన్న సినిమా కూడా ఓ మోస్తరు ఓపెనింగ్స్‌తో మొదలై అది కూడ చతికల పడింది. నాని సినిమా ‘అంటే సుందరానికీ’కి డీసెంట్ టాక్ వచ్చినప్పటికీ ఆసినిమా బయ్యర్లకు నష్టాలను మిగిల్చింది. ఆడవాళ్లు మీకు జోహార్లు – ఖిలాడి - గుడ్ లక్ సఖి -  హీరో - రౌడీ బాయ్స్ - సెబాస్టియన్ స్టాండప్ రాహుల్ – గని - భళా తందనాన - శేఖర్ గాడ్సే - చోర్ బజార్ ఇలా అనేక సినిమాలు ఫెయిల్యూర్ లిస్టులో చేరిపోయాయి. మొత్తంగా చూసుకుంటే ఒక్క ‘డిజే టిల్లు’ ‘విక్రమ్’ బయ్యర్లు తప్ప ఎవరు హ్యాపీగా లేరు అన్న మాటలు వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: