హైపర్ ఆది.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ప్రేక్షకుడుకి కూడా సుపరిచితుడుగా మారిపోయాడు. అయితే ఇతనికి ఇంత గొప్ప అవకాశం రావడానికి కారణం జబర్దస్త్ కార్యక్రమం అని చెప్పాలి. అప్పటివరకు ఒక అనామకుడు గా ఉన్న హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అందరికీ దగ్గర చేసింది అని చెప్పాలి. జబర్దస్త్ లో ఒక సాదా సీదా కమెడియన్ గా ఎంట్రీ  ఇచ్చిన హైపర్ ఆది  తన పంచులతో  సరికొత్త రికార్డు సృష్టించాడు. తక్కువ సమయంలోనే ఏకంగా టీం లీడర్ గా అవకాశం దక్కించుకున్నాడు. అయితే ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు అని చెప్పాలి.


ఒకవైపు రైటర్గా మరోవైపు కమెడియన్గా ఊహించని రేంజిలో పాపులారిటీ సంపాదించాడు హైపర్ ఆది. ఈ క్రమంలోనే ఈటీవీ లో ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాలకు హైపర్ ఆది స్క్రిప్ట్ అందిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. కేవలం బుల్లితెర కార్యక్రమాలకు మాత్రమే కాదు కూడా ఎన్నో సినిమాలకు కథలు అందించాడు హైపర్ ఆది. అయితే ఇటీవలే ఒక అమ్మాయిని పదకొండేళ్లుగా ఎంతో డీప్ గా ప్రేమిస్తున్నాను అంటూ షాకింగ్ విషయం చెప్పాడు.


 ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ లో భాగంగా ఇషా చావ్లా స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే పదకొండేళ్లుగా హీరోయిన్ ఇషా చావ్లా ని ప్రేమిస్తున్నాను. ప్రేమకావాలి సినిమా వచ్చినప్పటి నుంచి కూడా నీ మీద మనసు పారేసుకున్నా అంటూ స్టేజి మీద ప్రపోజ్ చేశాడు హైపర్ ఆది. ఈ క్రమంలోనే హైపర్ ఆది అలా చెప్పగానే ఇషాచావ్లా ఎంతగానో సిగ్గుపడిపోతూ ఉంది. ఇక ఇలా షో మొత్తం కూడా ఈ హీరోయిన్ ను లవ్ పడేసే ప్రయత్నం చేశాడు. అయితే ఇది చూసిన తర్వాత ఇక ఈ టీవీలో కార్యక్రమాలకు వచ్చే ఏ సెలబ్రిటీని జబర్దస్త్ కమెడియన్స్ వదలడం లేదు అంటూ నెటిజన్లు  కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: