గతకొంత కాలంగా వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న విజయ్ దేవరకొండ కెరియర్ కు ఆగష్టులో విడుదల కాబోతున్న ‘లైగర్’ మూవీ ఘనవిజయం అత్యంత కీలకంగా మారింది. కరోనా వేవ్ లు రాకముందు ప్రారంభం అయిన ఈమూవీ రకరకాల కారణాలతో విడుదల ఆలస్యం అవుతున్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ స్టైల్ కు భిన్నంగా ఈమూవీ నిర్మాణ పనులు ఇంత ఆలస్యం అవ్వడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.


పాన్ ఇండియా మూవీగా విడుదలకాబోతున్న ఈమూవీ ద్వారా విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఈమూవీ పై భారీ అంచనాలు ఉండటంతో ఈమూవీ డైరెక్ట్ రిలీజ్ కు అత్యంత భారీ ఓటీటీ ఆఫర్లు వస్తున్నా ఈమూవీ పై నమ్మకంతో ధియేటర్లకె మొగ్గు చూపుతున్నారు. ఈపరిస్థితులు ఇలాఉంటే ఈమూవీకి సంబంధించిన విజయ్ దేవరకొండ డిఫరెంట్ లుక్ తో ఉన్న ఒక డిఫరెంట్ పోష్టర్ ను విడుదలచేసారు. ఈపోష్టర్ లో విజయ్ నూడ్ గా కనిపించడం సంచలనంగా మారింది.


అయితే ఈపోష్టర్ లుక్ కాపీ అంటూ అప్పుడే విమర్శలు మొదలైపోయాయి. ఈపోష్టర్ లో విజయ్ లుక్ ను చూసిన వారికి వెంటనే అమీర్ ఖాన్ గతంలో నటించిన ‘పీకే’ మూవీలోని అతడి నూడ్ లుక్ ను గుర్తుకు చేస్తోంది. ఆమధ్య సంపూర్ణేష్ బాబు కూడ అతడు కొంతకాలం క్రితం నటించిన ‘కేలీఫ్లవర్’ మూవీలో నూడ్ లుక్ లో కనిపిస్తూ సంచలనం చేసాడు. దీనితో సంపూర్ణేష్ ను చాలామంది టార్గెట్ చేస్తూ బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ తో పోటీనా అంటూ కామెంట్స్ చేసారు.


ఇప్పుడు మళ్ళీ విజయ్ దేవరకొండ తన ‘లైగర్’ మూవీకోసం గతంలో అమీర్ ఖాన్ చేసిన సాహసాన్ని చేస్తూ ఉండటంతో ఇతడిని కూడ టార్గెట్ చేస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి విజయ్ దేవరకొండకు ఎంతమంది అభిమానులు ఉంటారో అంతకన్నా ఎక్కువగా వ్యతిరేకులు కూడ ఉంటారు. ముఖ్యంగా టాప్ హీరోల అభిమానులు విజయ్ ని ఎక్కడో అక్కడ కార్నర్ చేయడమే పనిగా ఎక్కడో అక్కడ విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ విజయ్ కొందరి నెగిటివ్ కామెంట్స్ కు టార్గెట్ గా మారడం సంచలనంగా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి: