హీరో అల్లరి నరేష్ ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తున్నారు.ఇటీవల నాంది సినిమా తో హిట్ కొట్టిన నరేష్ ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు.ఆ సినిమానే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. అయితే ఈ సినిమా సెట్‌లో ఒక్కసారిగా నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రత్యక్షమయ్యారు.బాలకృష్ణ సినిమా సెట్‌కి సమీపంలోనే నరేష్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం షూటింగ్ జరుగుతోంది. దీంతో ఈ సందర్భంగా బాలయ్య నరేష్ సినిమా సెట్‌లో సందడి చేశారు. ఆ చిత్రబృందంతో బాలకృష్ణ సరదాగా ముచ్చటిస్తూ వివరాల్ని అడిగి తెలుసుకున్నారు.


ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీమ్ బాలకృష్ణ ను కలవడం సంతోషం వ్యక్తం చేస్తోంది. అల్లరి నరేష్ మరియు టీమ్‌తో బాలకృష్ణ ఉన్నటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రాజేశ్ దండ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాజ్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. మారేడుమిల్లి ఫారెస్టు నేపథ్యంలో నడిచే ఈ కథలో నాయికగా ఆనంది కనిపించనుంది. ఇటీవల అల్లరి నరేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. 'మారేడుమిల్లి' అడవిలో ఓ గిరిజన గూడెం .. అక్కడ కూడా వాళ్లని ప్రశాంతంగా బ్రతకనీయకుండా చేసే రాజకీయాలు .. పోలీస్ యంత్రంగాలు. ఇద్దరి మధ్య నలిగిపోయే గిరిజనులు.
గిరిజనుల తరఫున పోరాడటం కోసం రంగంలోకి దిగిన ఒక యువకుడిగా అల్లరి నరేశ్ కనిపిస్తున్నాడు. ఇక గిరిజన గూడెంకు చెందిన యువతిగా కథానాయిక కనిపిస్తోంది.


ఇప్పటివరకు షూటింగ్ పనులను పూర్తీ చేస్తున్నారు. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు, విలన్ చేసిన కొన్ని పనుల వల్ల అల్లరి నరేష్ ని తప్పుగా భావించి ఆ ఊరి వాళ్ళు, పోలీసులు కొడతారు . ట్రైలర్‌లో మనకు ఇవే చూపించారు.మరోసారి నరేష్ కంటెంట్ సినిమాతో వస్తుండటంతో దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ టీజర్ చూసిన నెటిజన్స్ నరేష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోసారి మంచి కంటెట్‌తో నరేష్ సినిమా తీస్తున్నాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా భారీ విజయం సాధించాలని పలువురు నెటిజన్లు పోస్టులు చేశారు.మరి ఆ సినిమా ఎలాంటి హిట్ ను అందుకుంటుందొ చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: