విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్ 3 మూవీ మే 27 వ తేదీన గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా నటించగా , టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ దర్శకుడిగా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

2019 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని అదిరిపోయే కలెక్షన్ లను సాధించిన ఎఫ్ 2 సినిమాకు ఎఫ్ 3 మూవీ సీక్వెల్ గా తెరకెక్కింది. అలా ఎఫ్ 2 సినిమా మంచి విజయం సాధించడంతో ఎఫ్ 3 మూవీ పై సినిమాపై సినీ ప్రేమికులు ముఖ్యంగా కామెడీ సినిమా ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ మే 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర  మంచి కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఇలా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించిన ఎఫ్ 3 మూవీ మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

సినిమా ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయిన  సోనీ లివ్ 'ఓ టి టి' లో జూలై 23 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించగా రాజేంద్ర ప్రసాద్ , సునీల్మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ లో పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో నటించింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా , ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: