పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు మరియు రాజకీయాలు రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తూ రావడంతో కొన్ని సినిమాలు అనుకున్న తేదీకి అనుకున్న ప్రకారం షూటింగ్ లను జరుపుకోవడం లేదు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాతో దాదాపు సమానంగా హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ను మొదలు పెట్టాడు.  

హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మధ్యలో అనేక కారణాల వల్ల ఆగిపోవడంతో ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. మధ్యలో కొంత కాలం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఎలాంటి అవరోధాలు లేకుండా ఈ మూవీ కొన్ని షెడ్యూల్ షూటింగ్ జరిగినప్పటికీ ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ జరగడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకు సరైన సమయాన్ని కేటాయించ లేకపోతున్నాడు. అందువల్ల ఈ సినిమా షూటింగ్ కూడా అనుకున్నంత స్పీడ్ గా జరగడం లేదు. అందులో ఇది మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా షూటింగ్ కి కాస్త ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉంది. దానితో ఈ సినిమా షూటింగ్ ఇంకా డిలే అవుతుంది.  అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్సినిమా షూటింగ్ ని ఒకే ఒక నెలలో పూర్తి చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

అందులో భాగంగా హరిహర వీరమల్లు సినిమా కోసం ఆగస్ట్ నెలలో పవన్ కళ్యాణ్ బల్క్ డేట్స్ ని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ నెలతో ఈ సినిమా షూటింగ్ ను మొత్తం పూర్తి చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ , హరిహర వీరమల్లు మూవీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కి సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఆగస్ట్ నెలలో ఈ సినిమా షూటింగ్ ఎంత వరకు పూర్తి అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: