కొంతమంది దర్శకులకు ఎలాంటి బ్యాడ్ ఫేజ్ ఎదురవుతుంది అంటే వారికి హిట్టు వచ్చిన కూడా తదుపరి సినిమాను మొదట లేని పరిస్థితి ఏర్పడుతుంది. అలా హరీష్ శంకర్ గద్దల కొండ గణేష్ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకొని కూడా తన తదుపరి సినిమాను మొదలు పెట్టడానికి ఇంత సమయం తీసుకోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు అయింది.

అప్పటినుంచి హరీష్ శంకర్ తన సినిమాను ఇంకా మొదలు పెట్టనే లేదు. పవన్ కళ్యాణ్ తో ఆయన భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను అనౌన్స్ చేసి సంవత్సరం నర దాటిపోయిన కూడా ఇప్పటిదాకా దాన్ని మొదలు పెట్టలేకపోయాడు దాంతో హరీష్ ఎందుకు ఇంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నాడు అనే వాదనలు సినిమా పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. రచయితగా మంచి టాలెంట్ దర్శకుడిగా గొప్ప ప్రతిభను కలిగి ఉన్నాయి ఆయనకు. 

అలాంటి ఈ దర్శకుడు అనవసరంగా పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నాడని చెబుతున్నారు. మరి ఈ సినిమా తొందరలోనే మొదలవబోతుంది అని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్న కూడా అంతకంతకు ఆలస్యం అవుతూ వస్తుంది గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ చిత్రం పవన్ అభిమానులకు ట్రీట్ గా నిలుస్తుందని చెబుతున్నారు కానీ హరీష్ శంకర్ అభిమానులకు మాత్రం తీవ్ర మనోవేదనను కలిగిస్తుంది ఈ సినిమా. మరి ఇప్పటికైనా ఏదోకటి తేల్చుకునీ తదుపరి సినిమా ఆయన చేస్తాడా అనేది చూడాలి. అయన విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు ఇన్ సైడ్ గా వినిపిస్తున్నాయి. మరి ఈ భవదీయుడు భగత్ సింగ్ సినిమా పరిస్థితి ఏమవుతుందో ఎలా పవన్ కళ్యాణ్ తెల్చుతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: