అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కీర్తి సురేష్ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరుచుకుంది.  కీర్తి సురేష్ కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా ప్రస్తుతం తమిళం లో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ తమిళ్ లో కూడా క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది.

ఇలా తెలుగు , తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సాధించింది. ఇలా సర్కారు వారి పాట సినిమాతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న కీర్తి సురేష్ తాజాగా కోర్ట్ రూమ్ డ్రామా లో తెరకెక్కిన  వాషి సినిమాలో నటించింది. ఈ మూవీ లో టోవినో థామస్  హీరోగా నటించాడు. ఈ సినిమా ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది.

ఇలా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయిన నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో జూలై 17 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' సంస్థ ప్రకటించింది. ఈ మూవీ మలయాళం, తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలలో నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో ప్రసారం కానుంది. విష్ణు జి రాఘవ్ ఈ మొగిలి దర్శకత్వం వహించగా , కైలాస్ మీనన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: