టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో ఒకరు ఆయన నాగ శౌర్య గురించి తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే , ఛలో , జో అచ్యుతానంద వంటి విజయవంతమైన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నాగ శౌర్య తాజాగా వరుడు కావలెను , లక్ష్య సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. 

కాకపోతే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర నాగ శౌర్య అనుకున్న రేంజ్ విజయాలను అందించలేకపోయాయి. లక్ష్య సినిమా కోసం నాగ శౌర్య అదిరిపోయే రేంజ్ లో బాడీ ని కూడా బిల్డప్ చేశాడు. ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇది ఇలా ఉంటే వరుడు కావలెను , లక్ష్య సినిమాలతో వరుసగా అపజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొన్న నాగ శౌర్య ప్రస్తుతం అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా , మాళవికా నాయర్ ఈ మూవీ లో నాగ శౌర్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే నాగ శౌర్య , అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇది వరకు తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే,  జో అచ్యుతానంద సినిమాలు మంచి విజయాలు సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇలా ప్రస్తుతం సినీ ప్రేమికుల్లో మంచి అక్షరాలు కలిగి ఉన్న ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతుంది. అక్కడి అందమైన లొకేషన్ లలో ఈ సినిమాలోని కీలక తారాగణంపై ఈ సినిమా చిత్ర బృందం కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మరి ఈ మూవీ తో నాగ శౌర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటుండో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: